జూపెడ గ్రామంలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం !
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహకారంతో 5 లక్షల నిధులు
తిరుమలాయపాలెం | జూలై16 | ఖమ్మం వాణి: జూపెడ గ్రామంలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహకారంతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను సోమవారం ప్రారంభించారు. జూపెడ చెరువు అలుగు నుంచి ఎలుక వీరనారాయణ ఇంటి వరకు 5 లక్షల రూపాయల వ్యయంతో 4 మీటర్ల వెడల్పు, 80 మీటర్ల పొడవు గల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ వనవాసం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అందిస్తున్న సహకారాన్ని అభినందించారు. ఈ రోడ్డు వల్ల గ్రామస్తులకు రాకపోకలకు సౌకర్యంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు తిప్పారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్, అంబాల రామ్మూర్తి, ప్రభాకర్ రెడ్డి, కృష్ణారెడ్డి, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
