ఆకేరు వరదకు కొట్టుకుపోయిన సుబ్లేడు బ్రిడ్జి వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు - ఖమ్మం వాణి కథనం ఎఫెక్ట్
“కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు” కాదు.. “కంటెంట్ ఉన్నోడికి కటౌట్లతో పనిలేదు” – తిరుమలాయపాలెంలో ఖమ్మం వాణిపై ప్రశంసలు
తిరుమలాయపాలెం వార్తలు: ఆకేరు వరదకు కొట్టుకుపోయిన వంతెనలు..
ఖమ్మం వాణి ఫౌండర్ రామకృష్ణకు ప్రజల జేజేలు
ఖమ్మం వాణి, తిరుమలాయపాలెం – జూలై 15:

తిరుమలాయపాలెం వార్తల్లో ఇప్పుడు ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. “కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు” అనే డైలాగ్ గబ్బర్ సింగ్ సినిమాలో బ్రహ్మానందం చెప్పింది. అది ఒక సందర్భంలో విలన్ దగ్గరికి డబ్బుల కోసం వెళ్తూ హీరో పవన్ కళ్యాణ్ కటౌట్ పట్టుకుని చెప్పిన మాట.
కానీ ఇక్కడ తిరుమలాయపాలెం ప్రజలు చెబుతున్నది వేరు.
“అసలు కంటెంట్ ఉన్నోడికి కటౌట్లతో పనేలేదు” – అంటే పెద్ద పత్రిక అనే బ్రాండ్ అవసరం లేదని.
ఖమ్మం వాణి డిజిటల్ ప్లాట్ఫారం వెబ్సైట్ ఫౌండర్ గుజ్జ రామకృష్ణ రాసిన ఒకే ఒక్క కథనంతో అధికారులు స్పందించడంతో ప్రజలు ఇదే మాట అంటున్నారు.
కొందరు “మేము పెద్ద పత్రికల్లో పనిచేస్తున్నాం” అంటూ పెద్ద-చిన్న అనే తేడా చూపిస్తుంటారు. కానీ సరైన కంటెంట్ ఉంటే ఏ అధికారులైనా స్పందిస్తారని, పెద్ద పేరు అవసరం లేదని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు.
కొద్ది కాలంలోనే ఏర్పాటైన ఖమ్మం వాణి డిజిటల్ ప్లాట్ఫారం వెబ్సైట్ పై ఇప్పుడు ప్రశంసల జల్లు కురుస్తోంది.
• ఆకేరు వరదకు కొట్టుకుపోయిన వంతెనలు
గతంలో కురిసిన అకాల వర్షాలకు ఆకేరు వరద ప్రవాహానికి తిరుమలాయపాలెం మండలం వ్యాప్తంగా తీవ్ర నష్టం వాటిల్లింది. ఆ ప్రవాహానికి *సుబ్లేడు*, హాస్నాబాద్, బంధంపల్లి వంతెనలు కొట్టుకుపోయాయి. దీంతో గ్రామాల మధ్య రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి.
ప్రస్తుతం కొట్టుకుపోయిన వంతెనల స్థానాల్లో నూతన వంతెనల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. అయితే నిర్మాణ సంస్థ కనీస భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
• హెచ్చరిక బోర్డులు లేవు.. ప్రమాదాలకు ఆహ్వానమా?
వంతెనల నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతాల్లో వాహనదారులకు హెచ్చరిక బోర్డులు, రాత్రి వేళల్లో కనిపించే రేడియం రిఫ్లెక్టర్లు, బ్యారికేడ్లు, తాత్కాలిక మళ్లింపు మార్గాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ చాలా చోట్ల అలాంటి ఏర్పాట్లు కనిపించడం లేదు.
పాత రోడ్లను పూడ్చి మళ్లింపు మార్గాలు వేసినా ఒక్క సూచిక కూడా లేకపోవడంతో రాత్రిపూట వాహనదారులు ప్రమాదాల బారిన పడే ప్రమాదం పొంచి ఉంది.
• ఖమ్మం వాణి కథనంతో తక్షణ స్పందన
ఈ విషయాన్ని గమనించిన స్థానికులు, ప్రమాదం నుంచి తప్పించుకున్న వాహనదారులు వెంటనే ఖమ్మం వాణి ఫౌండర్ రామకృష్ణ దృష్టికి తీసుకువచ్చారు.
రామకృష్ణ వెంటనే బంధంపల్లి, ఇతర ప్రాంతాలను పరిశీలించి ఫోటోలతో సహా కథనాన్ని ప్రచురించారు. అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు.
కథనం వెలువడిన వెంటనే అధికారులు స్పందించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన కాంట్రాక్టర్ను మందలించి, తక్షణమే మళ్లింపు ప్రదేశాల్లో హెచ్చరిక ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీంతో అధికారులు అక్కడ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి పెద్ద ప్రమాదాన్ని నివారించారు.
• ప్రజల నుంచి హర్షం
ఈ ఘటనపై తిరుమలాయపాలెం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. “పెద్ద పేపర్ కావాలా? కంటెంట్ కరెక్ట్ గా ఉంటే చాలు. రామకృష్ణ అన్న వార్త రాయగానే అధికారులు దిగివచ్చారు. ఒక ప్రాణం కాపాడినట్టే” అని అంటున్నారు. “ప్రమాదం జరగకముందే చర్యలు తీసుకోవాలి” అంటూ ఖమ్మం వాణి లేవనెత్తిన సమస్యకు తక్షణ పరిష్కారం లభించడంతో ప్రజలు అభినందిస్తున్నారు.
అర్హత ఉన్న విద్యార్థులకు తీవ్ర అన్యాయం..?
