దమ్మాయిగూడెంలో శివ పేటకు వితరణ చేస్తున్న దృశ్యం
దమ్మాయిగూడెంలో మానవతా ఘట్టం: అమరుడు లింగయ్య జ్ఞాపకార్ధం ఉచిత శవపేటిక వితరణ
పేదల ఆర్థిక భారం తగ్గించేందుకు గొప్ప నిర్ణయం
ఖమ్మం వాణి, తిరుమలాయపాలెం | జూలై 18 : ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెం గ్రామంలో శనివారం ఒక మానవతా ఘట్టం ఆవిష్కృతమైంది. గ్రామానికి చెందిన అమరుడు సోమనపల్లి లింగయ్య మరియు పెద్ద భార్య నాగమ్మ జ్ఞాపకార్ధంగా, చిన్న భార్య సోమనపల్లి సూరమ్మ మరియు కుమారుడు సోమనపల్లి వెంకటేశ్వర్లు కుటుంబం ఉచిత శవపేటికను గ్రామపంచాయతీకి వితరణ చేశారు.

• కుటుంబ సభ్యుల చొరవ
గ్రామంలో పేద ప్రజలు కుటుంబంలో ఎవరైనా మరణిస్తే శవాన్ని భద్రపరచడానికి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని గమనించిన సూరమ్మ, వెంకటేశ్వర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. గ్రామపంచాయతీ సర్పంచ్ వీరదాసు వినోద్, కార్యదర్శి రమేష్ సమక్షంలో శవపేటికను అధికారికంగా అందజేశారు. ఇకపై గ్రామంలో ఎవరు మరణించినా ఈ “పిజ్జార్ బాక్స్” ను ఉచితంగా అందించాలని కుటుంబం నిర్ణయించింది. దీనిపై గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
• నాయకుల ప్రశంసలు
ఈ సందర్భంగా గ్రామపంచాయతీ పాలకవర్గం సూరమ్మ, వెంకటేశ్వర్ల కుటుంబాన్ని అభినందించింది. గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని సర్పంచ్ వీరదాసు వినోద్, ఉప సర్పంచ్ ఉన్నం రాజశేఖర్ కోరారు. CPI(ML) మాస్ లైన్ తిరుమలాయపాలెం మండల కార్యదర్శిగా ఉన్న సోమనపల్లి వెంకటేశ్వర్లును అందరూ ఆదర్శంగా తీసుకొని గ్రామ సేవలో పాల్గొనాలని నాయకులు సూచించారు. కార్యక్రమంలో సోమనపల్లి సూరమ్మ, వెంకటేశ్వర్లు, కుమార్తెలు, అల్లుళ్లు మాడుగుల వెంకన్న-కుసుమ, అనంతగిరి వెంకన్న-పద్మ, గట్టు ఎల్లయ్య-సుశీల, CPI(ML) జిల్లా నాయకులు తిమ్మిడి హనుమంతరావు, PYL మండల అధ్యక్షుడు ఉన్నం నరేష్, మాజీ సర్పంచ్ కూసు అప్పారావు, వార్డు సభ్యులు సేకినాబి, చామకూరి ప్రమీల తదితరులు పాల్గొన్నారు.
