పాలేరు పరిధిలో పలు ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్న కందాళ ఉపేందర్ రెడ్డి.
కూసుమంచి, తిరుమలాయపాలెం, నేలకొండపల్లి మండలాల్లో ఆలయ భూమి పూజలు, విగ్రహ ప్రతిష్ఠలు, వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే
పాలేరు |జూలై 08 |ఖమ్మం వాణి : పాలేరు నియోజకవర్గ పరిధిలో మాజీ శాసనసభ్యుడు కందాళ ఉపేందర్ రెడ్డి పలు ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మండలంలోని రాజుపేట బజార్ గ్రామంలో గంగమ్మ తల్లి ఆలయ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమలాయపాలెం మండలంలోని తాళ్ళచెరువు గ్రామంలో ముత్యాలమ్మ, మారెమ్మ, అంకాలమ్మ దేవతల విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరై తీర్థప్రసాదాలు స్వీకరించారు. అదే మండలంలోని పాపాయిగూడెం గ్రామానికి చెందిన ఉప్పల బ్రహ్మచారి, సత్యావతి దంపతుల కుమారుడు రవీంద్రచారి, గాయత్రి వివాహానంతర ఆహ్వాన సభకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. హస్నాబాద్ గ్రామానికి చెందిన సింధూజ, మహిపాల్ రెడ్డి వివాహ వేడుక పాలేరు పట్టణంలోని బీవీ రెడ్డి ఫంక్షన్ హాలులో నిర్వహించగా, ఆ కార్యక్రమానికి హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. నేలకొండపల్లి మండలంలోని కట్టకొమ్ముతండా గ్రామంలో బొడ్రాయి, ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠ పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
