Khammam:Sr Reporter – Rk
తిరుమలాయపాలెం మండలం బచ్చోడు గ్రామంలో ప్రీ ప్రైమరీ ఉద్యోగాల ఎంపికలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని పైరవీదారులు చేజెక్కించుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. గ్రామానికి కేటాయించిన రెండు పోస్టులను అనర్హులకు ఇచ్చి, అర్హులకు తీవ్ర అన్యాయం చేశారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. B.Ed, D.Ed చేసి సంవత్సరాల అనుభవం ఉన్న SC, BC అభ్యర్థుల దరఖాస్తులను అధికారం ఉందనే అహంకారంతో మండల స్థాయిలోనే నిలిపివేశారని నిరసనకారులు తెలిపారు. “కడుపు నాయకట్టుకొని చదివించుకున్న తల్లిదండ్రులకు తీవ్ర అన్యాయం జరిగింది”అంటూ సోమవారం ఖమ్మం కలెక్టరేట్ ఎదుట వారు నిరసన చేపట్టారు. ఇది కేవలం బచ్చోడు గ్రామానికే పరిమితం కాదని, మండల వ్యాప్తంగా, నియోజకవర్గం వ్యాప్తంగా ఇదే విధంగా జరుగుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు వెంటనే స్పందించి నిజమైన అర్హులకు న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. పైరవీలు చేసి ఉద్యోగాలు సంపాదించిన వారు గుర్తుంచుకోండి.. అర్హుల కన్నీళ్లు ఊరికే పోకపోవచ్చు.
