పాలేరులో దారుణం ఒకే కుటుంభంలో నాలుగు ఉద్యోగాలు?
ప్రజా ప్రభుత్వంలో పైరవవీలకే పెద్ద పీట
బచ్చోడు పైరవీల హవా: అర్హత కాదు, పైరవీదే హవానా?
బచ్చోడు పైరవీల హవా: ఎస్సీ (s c) దళితులకు తీవ్ర అన్యాయం
ఖమ్మం వాణి | 12 జూలై, 2026 | డెస్క్: ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో పైరవీల హవా సాగుతోంది. ప్రజా ప్రభుత్వం” అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరుపేదలకు తీవ్ర అన్యాయం జరుగుతుందా అనే అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బచ్చోడు గ్రామంలో జరుగుతున్న పరిణామాలు చూస్తే అర్హత కంటే పైరవీకే ఎక్కువ విలువ ఇస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
అధికారంలోకి వచ్చిన తర్వాత పారదర్శక పాలన అందిస్తామని చెప్పిన ప్రభుత్వంలోనే ఇలాంటి అక్రమాలు జరుగుతుండటంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని నిరుపేదలు, అర్హులైన అభ్యర్థులు తమకు అన్యాయం జరిగిందని వాపోతున్నారు.
• ఒకే కుటుంబానికి 2 ఇందిరమ్మ ఇళ్లు + 2 ఉద్యోగాలు
ప్రభుత్వ పథకాలు నిజమైన పేదలకు అందాలని ప్రభుత్వం చెబుతున్నా, బచ్చోడులో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. ఆర్థికంగా నిలదొక్కుకున్న ఒకే BC యాదవ కుటుంబానికి 2 ఇందిరమ్మ ఇండ్లు మంజూరైనట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఇదే కుటుంబానికి ప్రీ ప్రైమరీ టీచర్, ఆయా పోస్టులు కూడా 2 వచ్చాయని సమాచారం. తిరుమలాయపాలెం మండలంలో మొత్తం 3 టీచర్, 3 ఆయా పోస్టులు రాగా, బచ్చోడు గ్రామంలోని 3 పోస్టుల్లో 2 పోస్టులు ఒకే కుటుంబానికి దక్కడం చర్చనీయాంశమైంది.
B.Ed, D.Ed చేసి అనుభవం ఉన్న దాదాపు 20 మంది అభ్యర్థులు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ చివరకు పైరవీ, రాజకీయ ఒత్తిడి ఉన్నవారికే ఉద్యోగాలు వచ్చాయని గ్రామస్తులు మండిపడుతున్నారు. మెరిట్ కి విలువ లేకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ వార్తా కూడా చదవండి.
రెండు గంటల్లో ఆరుగురిని చంపపిన ఫోక్సో నిందితుడు..
• అర్హత ఉన్నా SC అభ్యర్థికి తీవ్ర అన్యాయం
అదే గ్రామానికి చెందిన ఒక SC మహిళ B.Ed, D.Ed పూర్తి చేసింది. ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో పని చేసిన అనుభవ సర్టిఫికెట్ కూడా ఆమె వద్ద ఉంది. SC రిజర్వేషన్ కోటా కూడా ఉంది. అన్ని అర్హతలు ఆమెకే ఉన్నా ఉద్యోగం మాత్రం రాలేదు.
“పైరవీ లేదు, ఏ నాయకుడి దగ్గర ఊడిగం చేయలేదు అందుకే ఉద్యోగం రాలేదు” అని ఆమె కన్నీరు పెట్టుకుంది. “అర్హత ఉన్నా మాకు మోసం, అర్హత లేకున్నా వారికి కొలువులు. ఇదేనా ప్రజా ప్రభుత్వం? రిజర్వేషన్లకు విలువ లేదా?” అని ఆమె ప్రశ్నిస్తుంది.
ఈ ఘటనతో గ్రామంలోని SC, ST వర్గాల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం చెబుతున్న సామాజిక న్యాయం మాటలకే పరిమితమైందా అనే అనుమానాలు వస్తున్నాయి.
• దొరల దగ్గర తిరిగేవారికే అన్నీనా?
“ఎవరైతే పెద్దల దగ్గర తిరుగుతారో, పైరవీలు చేస్తారో వారికే అన్ని పథకాలు, ఉద్యోగాలు దక్కుతున్నాయి” అని బచ్చోడు ప్రజలు ఆరోపిస్తున్నారు. న్యూట్రల్ గా ఉండి కష్టపడి చదివిన నిరుపేదలకు, అర్హత ఉన్నా ఈ ప్రభుత్వంలో చోటు లేకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామంలోని యువత కూడా ఈ విషయంపై ఆగ్రహంగా ఉన్నారు. చదువుకొని, అర్హతలు సంపాదించినా ఉద్యోగాలు రాకపోతే భవిష్యత్తు ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు.
• రాష్ట్ర మంత్రి శ్రీనివాస రెడ్డికి ప్రజల విజ్ఞప్తి
ఈ దారుణాలన్నీ జరుగుతున్నది పాలేరు నియోజకవర్గంలోనే అని ప్రజలు అంటున్నారు. “నా నియోజకవర్గంలో పైరవీలకు తావు లేదు” అని స్థానిక రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పలుమార్లు చెప్పినా, కళ్ల ముందే పేదల గొంతు నులిమేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
మంత్రి గారు వెంటనే స్పందించి ఈ అక్రమాలపై విచారణ జరిపించాలని గ్రామస్తులు కోరుతున్నారు. అర్హులకు న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
• వెంటనే విచారణ జరపాలని డిమాండ్
ఈ నేపథ్యంలో బచ్చోడు గ్రామ ప్రజలు 3 ప్రధాన డిమాండ్లు చేస్తున్నారు:
1. ఈ నియామకాలపై వెంటనే ఉన్నత స్థాయి విచారణ జరపాలి
2. అనర్హులను తొలగించి అర్హులైన SC, ST, BC నిరుపేదలకు అవకాశం కల్పించాలి
3. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో జరిగిన అక్రమాలను కూడా సమగ్రంగా విచారించాలి
“ప్రజా ప్రభుత్వం” అనే మాటకు అర్థం లేకుండా పోతుందని, లేకుంటే ప్రజలు రోడ్డెక్కి పెద్ద ఎత్తున నిరసనలు చేసే రోజు దూరంలో లేదని వారు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
(/category/jobs/)

