చావా వెంకటేశ్వరరావు జ్ఞాపకార్థం స్మశాన వాటిక కమిటీకి డీసీఎం వాహనం వితరణ
చావా వేణుగోపాలకృష్ణ చేతుల మీదుగా అందజేత
ఖమ్మం/తిరుమలాయపాలెం, జూన్ 26 (ఖమ్మం వాణి): ఖమ్మం పట్టణ ప్రజల సౌకర్యార్థం కీ.శే. చావా వెంకటేశ్వరరావు జ్ఞాపకార్థం వారి కుమారుడు చావా వేణుగోపాలకృష్ణ డీసీఎం వాహనాన్ని హిందూ స్మశాన వాటికల నిర్వహణ కమిటీకి అందజేశారు. శుక్రవారం నగరంలో జరిగిన కార్యక్రమంలో వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ “ప్రజలే బలం, సంక్షేమమే లక్ష్యం. ప్రజల సమస్యలే ఏజెండా. రాజకీయాల్లో సమస్యలు వినే ఓపిక అవసరం. సమస్యతో వచ్చినవారి మాట ఓపికగా విని పరిష్కారానికి కృషి చేయాలి. ప్రజల సమస్యలకు పరిష్కారం చూపినప్పుడే ఆదర్శ నాయకుడిగా నిలుస్తాం” అని తెలిపారు. “సమాజ సేవలో నిత్యం ప్రజల మధ్య ఉంటూ సేవ చేసేవారికి ప్రజలు అండగా నిలుస్తారు. కష్టాల్లో ఉన్న కుటుంబాలకు నేనున్నాననే భరోసా ఇవ్వడం బాధ్యత. త్వరలో కొక్కిరేణి గ్రామానికి శుభవార్త ఉంటుంది. మాట తప్పని, మడమ తిప్పని నైజమే సిద్ధాంతం. సేవే పరమ ధర్మం” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హిందూ స్మశాన వాటికల నిర్వహణ కమిటీ అధ్యక్షుడు సీఏ రాయపూడి రంగనాథ్, ఉపాధ్యక్షుడు పుల్లకొండ నాగేంద్రం, కార్యదర్శి రాయపూడి అనంత పద్మనాభం, కోశాధికారి వడ్డీబోయిన నరసింహారావు, కమిటీ సభ్యుడు పెనుకొండ శ్రీనివాసరావు, నంబూరి శేషు, గద్దల మన్మధరావు, గుగ్గిళ్ళ అశోక్, ఉడుగు అప్పయ్య, పోట్ల ఉపేందర్, గంట కృష్ణ, గద్దల ఉపేందర్, ఉలవ వీరభద్ర, గంట నారాయణ, సబ్బు రామారావు, గంధం శోభన్ బాబు, బలుసుపాటి తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.
