జూపెడలో పల్స్ పోలియో ప్రారంభించిన సర్పంచ్ నరేందర్ రెడ్డి.
తిరుమలాయపాలెం,జూన్ 28 (ఖమ్మం వాణి)
జూపెడ గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ వనవాసం నరేందర్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని లాంఛనంగా మొదలుపెట్టారు. ఈ జూపెడ పల్స్ పోలియో కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏఎన్ఎం పి. ఎల్లమ్మ, అంగన్వాడీ సూపర్వైజర్ సంధ్య, అంగన్వాడీ టీచర్లు పూలమ్మ, సుహాసిని, ఆశ వర్కర్ ఉమా తో పాటు గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, “ఐదేళ్లలోపు ప్రతి ఒక్క చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి. జూపెడ గ్రామంలో 100 శాతం లక్ష్యాన్ని సాధించేందుకు అందరూ సహకరించాలి” అని పిలుపునిచ్చారు. పోలియో రహిత సమాజమే మన లక్ష్యం అని తెలిపారు.
