గ్రామ సంఘం భవనాలను త్వరితగతిన పూర్తి చేయాలి – ఎంపీడీఓ ఎస్.కె. సిలార్ సాహెబ్
తిరుమలాయపాలెం, జూన్ 18:(ఖమ్మం వాణి)
తిరుమలాయపాలెం మండలంలోని పలు గ్రామ పంచాయతీల్లో నిర్మాణంలో ఉన్న గ్రామ సంఘం భవనాల పనులను గురువారం ఎంపీడీఓ ఎస్.కె. సిలార్ సాహెబ్ పరిశీలించారు.ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ, గ్రామ సంఘం భవనాల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులు చేపట్టాలని, నిర్మాణంలో ఎలాంటి లోపాలకు తావు లేకుండా చూడాలని సూచించారు. గ్రామాల్లో స్వయం సహాయక సంఘాల సమావేశాలు, శిక్షణా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఈ భవనాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన అన్నారు. ఎంపీడీఓ వెంట సహాయక కార్య నిర్వాహక అభియంత (పంచాయతీ రాజ్), మండల పంచాయతీ అధికారి, సంబంధిత సర్పంచులు ఉన్నారు. తిరుమలాయపాలెం మండలంలోని బచ్చోడు, పైనంపల్లి, రాజారం, సుబ్లేడు, దమ్మాయిగూడెం, గోపాలపురం, కొక్కిరేణి గ్రామ పంచాయతీల్లో గ్రామ సంఘం భవనాల పనులను వారు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.ప్రస్తుతం గోపాలపురం పరిధిలోని ఎర్రగడ్డ లో భవన నిర్మాణానికి గుర్తులు వేయడం పూర్తి కాగా, మిగతా ఆరు గ్రామాల్లో స్తంభాల స్థాయి వరకు నిర్మాణం పూర్తయింది. ఇసుక, కంకర, ఇటుక, సిమెంటు సామగ్రిని పని ప్రదేశాల్లో నిల్వ చేశారు. పనుల పురోగతిపై ఎంపీడీఓ సంతృప్తి వ్యక్తం చేస్తూ, వర్షాకాలం లోపు స్లాబు స్థాయి వరకు పూర్తి చేయాలని ఆదేశించారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన కు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. గ్రామ సంఘం భవనాల నిర్మాణానికి సంబంధించిన పథకం వివరాలు, మార్గదర్శకాలను తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ వేగంగా రూపొందిస్తుంది.ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ, ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్న ఈ భవనాలను ప్రజలకు త్వరగా అందుబాటులోకి తేవాలని, నాణ్యతలో రాజీ పడవద్దని సూచించారు. గ్రామాల అభివృద్ధికి ఇవి ఎంతో దోహదపడతాయని తెలిపారు.
ఈ వార్తకు సంబంధించిన వీడియో కోసం మా YouTube ఛానల్ చూడండి:
https://youtube.com/@khammamvaani
https://youtube.com/@khammamvaani?si=f1u9h2aF–6ybZan
