పాలేరు నియోజకవర్గ ప్రజలకు కందాళ పిలుపు.
ఖమ్మం జిల్లా,పాలేరు(ఖమ్మం వాణి) భారత రాష్ట్ర సమితి సంస్థాగత బలోపేతం, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించడానికి ఈనెల 17వ తేదీన ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పార్టీ కార్యకర్తల సమావేశం జరగనుంది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు సమావేశానికి హాజరై దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా బాధ్యుడు తక్కెళ్లపల్లి రవీందర్ రావు, రాష్ట్ర పార్టీ కార్యదర్శి, శాసనమండలి సభ్యుడు తాతా మధుసూదన్, జిల్లా రాష్ట్ర నాయకత్వం పాల్గొననున్నారు. పాలేరు నియోజకవర్గం ఖమ్మం రూరల్ లో వెంకటగిరి క్రాస్ రోడ్డులోని శ్రీహర్ష కన్వెన్షన్లో ఉదయం పది గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది. బూత్ స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేసే లక్ష్యంతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినట్లు నాయకులు తెలిపారు. ఈ సమావేశానికి తన నియోజకవర్గం నుంచి ప్రతి బూతుకు ఇద్దరు, ప్రతి గ్రామానికి ముగ్గురు ముఖ్య నాయకులు పాల్గొనాలని పాలేరు మాజీ శాసనసభ్యుడు కందాళ ఉపేందర్ రెడ్డి పిలుపునిచ్చారు.

Good morning