కూసుమంచిలో మానసిక దివ్యాంగుల మధ్య బీజేపీ నేత ఉపేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు
ఖమ్మం/కూసుమంచి, జూన్ 20 (ఖమ్మం వాణి):
మానసిక దివ్యాంగుల మధ్య జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఎంతో ఆత్మ సంతృప్తినిస్తుందని బీజేపీ జిల్లా నాయకులు గుండా ఉపేందర్ రెడ్డి అన్నారు.కూసుమంచి మండల కేంద్రంలోని మానసిక వికలాంగుల పునరావాస కేంద్రంలో శనివారం పిల్లల మధ్య ఆయన జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా పిల్లలకు పండ్లు అందజేసి, వారి చేతుల మీదుగా కేక్ కట్ చేయించారు. పిల్లల యోగక్షేమాలను అడిగి తెలుసుకుని, ప్రభుత్వం నుండి వారికి అందుతున్న సహాయం గురించి సిబ్బందిని వాకబు చేశారు.ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం నుండి ఈ కేంద్రానికి ఇంకా మెరుగైన సహాయం, వసతులు కల్పించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు సభ్యురాలు మంద నవ్య చంద్రశేఖర్ గౌడ్, స్థానిక నాయకులు ఆడేపు శివ, దామళ్ళ కోటి, మంద చంద్రశేఖర్ గౌడ్, బద్దం వెంకటరెడ్డి, పిట్టల వేణు మరియు కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు.
