ఆపదలో అండగా మంత్రి పొంగులేటి –
64 కుటుంబాలకు పీఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా రూ.6.40 లక్షల ఆర్థిక సాయం.
ప్రజల కష్టాల్లో అండగా నిలవడమే నిజమైన ప్రజాసేవ అని మరోసారి నిరూపించారు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
తిరుమలాయపాలెం, జూన్ 19 (ఖమ్మం వాణి)
తిరుమలాయపాలెం మండల పరిధిలో ఇటీవల వివిధ కారణాలతో కుటుంబ పెద్దలను కోల్పోయి విషాదంలో ఉన్న 64 కుటుంబాలకు మంత్రి పొంగులేటి సూచనల మేరకు పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్థిక భరోసా కల్పించారు. మండలంలోని పలు గ్రామాలకు చెందిన 64 మంది మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున మొత్తం రూ.6,40,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమం మానవతా దృక్పథంతో నిర్వహించినట్లు ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు.ఈ సందర్భంగా పాలేరు నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్ చావా శివరామకృష్ణ మాట్లాడుతూ, “మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రజల సంతోషంలోనే కాకుండా, కష్టకాలంలో కూడా తోడుగా నిలిచే నాయకుడు. కుటుంబ పెద్దను కోల్పోయిన బాధితులకు ధైర్యం చెప్పి, ఆర్థికంగా ఆదుకోవడం ఆయన సేవా దృక్పథానికి నిదర్శనం” అని అన్నారు. పాలేరు నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమాన్ని సమానంగా ముందుకు తీసుకెళ్తూ ప్రతి గ్రామం, ప్రతి కుటుంబం సంక్షేమమే లక్ష్యంగా మంత్రి పొంగులేటి పనిచేస్తున్నారని ఆయన కొనియాడారు. “ప్రజల బాధను తన బాధగా భావించి స్పందించే నాయకత్వమే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి” అని చావా శివరామకృష్ణ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బోడ మంగీలాల్, మండల కాంగ్రెస్ నాయకులు గుగ్గిళ్ళ అంబేద్కర్, తాటికొండ కిరణ్, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దూదిమెట్ల వెంకట్, ధరావత్ వినోదం, కర్నాటి రాజేంద్రప్రసాద్, సిరిగద్దె ఉపేందర్, పుసులూరి సురేష్, దుబాకుల పిచ్చయ్య, పత్తి నాగేశ్వరరావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ నల్లమల ప్రతాప్, ఆత్మ కమిటీ డైరెక్టర్ బెల్లం రాము, తిమ్మిడి వెంకట్, చీమ లక్ష్మయ్య, బానోతు సిమ్లా, పోట్ల కిరణ్, చామకూరి శ్రీనివాస్, రమేష్, షేక్ సలీం, బెజ్జనబోయిన రాంబాబు, నరేష్, వేల్పుల వీరన్న, కట్కూరి శ్రీనివాస్ రెడ్డి, రామ్ రెడ్డి, సంఘ బత్తుల సుమన్, భానోత్ అనిల్, షేక్ కరీం, సైదా, వరిగడ్డి సాగర్, గొల్ల లింగయ్య, లింగన్నతో పాటు గ్రామ నాయకులు, పొంగులేటి అభిమానులు పాల్గొన్నారు.

Hi