పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి సుడిగాలి పర్యటన…
పలు వివాహాలు,కాటమయ్య విగ్రహ ప్రతిష్టల్లో పాల్గొని ఆశీర్వచనం.
ఖమ్మం,జూన్20,(ఖమ్మం వాణి ):
పాలేరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు కందాళ ఉపేందర్ రెడ్డి శనివారం ఖమ్మం జిల్లాలో సుడిగాలి పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా ఖమ్మం రూరల్, కూసుమంచి, నేలకొండపల్లి మండలాల్లో జరిగిన పలు వివాహ వేడుకలతో పాటు కాటమయ్య విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.
పాలేరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు కందాళ ఉపేందర్ రెడ్డి శనివారం ఖమ్మం జిల్లాలో సుడిగాలి పర్యటన చేపట్టారు. ముందుగా ఖమ్మం రూరల్ మండలం మంగళగూడెం గ్రామానికి చెందిన బొడ్డు నరసయ్య-కృష్ణవేణిల కుమార్తె సౌమ్య-గోపిల వివాహం కోదాడలోని పురుమా రంగారావు-సుబ్బమ్మ ఫంక్షన్ హాల్లో జరగగా, ఆ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం నేలకొండపల్లి మండలం రాయిగూడెం గ్రామంలో తోట లక్ష్మయ్య-రాంబాయి దంపతుల కుమారుడు రాంబ్రహ్మం-స్పందనల వివాహ వేడుకకు హాజరయ్యారు. కూసుమంచి మండలంలో వెంకట్రాంపురం గ్రామానికి చెందిన లక్ష్మయ్య-వీరభద్రమ్మ కుమారుడు రాజేష్-ఇందుల వివాహానికి, కోక్యతండ గ్రామానికి చెందిన తేజావత్ బాలాజీ-లక్ష్మీ కుమారుడు సాయికుమార్-అంజలిల వివాహానికి, నాయకన్ గూడెం గ్రామానికి చెందిన వెన్నెల సత్యం-సునీత కుమారుడు రాకేష్-దివ్యల వివాహానికి హాజరై నూతన వధూవరులకు అక్షింతలు వేసి శుభాకాంక్షలు తెలిపారు. వివాహాలతో పాటు నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురం, ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి గ్రామాల్లో జరిగిన కాటమయ్య విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలకు హాజరైన ఉపేందర్ రెడ్డి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఒకే రోజు ఐదు వివాహ వేడుకలు, రెండు విగ్రహ ప్రతిష్టల్లో పాల్గొన్న కందాళ ఉపేందర్ రెడ్డి అన్ని చోట్లా ప్రజలతో మమేకమయ్యారు. ఈ కార్యక్రమాల్లో మండల నాయకులు, కార్యకర్తలు, మాజీ ప్రజా ప్రతినిధులు, అభిమానులు పాల్గొన్నారు.
