మాజీ ఎమ్మెల్యే కందాళ స్ఫూర్తితో: మృతుడి కుటుంబానికి బీఆర్ఎస్ నాయకుల ఆర్థిక సాయం.
తిరుమలాయపాలెం, జూన్ 24 (ఖమ్మం వాణి): పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి స్ఫూర్తితో మరణించిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం అందించే కార్యక్రమం కొనసాగుతోంది. హస్నాబాద్ గ్రామానికి చెందిన మిటకోల వెంకటయ్య ఇటీవల మృతి చెందారు. ఆయన దశదిన కర్మ కార్యక్రమంలో భాగంగా, కందాళ ఉపేందర్ రెడ్డి ఆదేశాల మేరకు హస్నాబాద్ బీఆర్ఎస్ నాయకులు మృతుని కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా వెంకటయ్య కుటుంబానికి బీఆర్ఎస్ నాయకులు రూ.5,000 ఆర్థిక సాయం అందజేశారు. కందాళ ఉపేందర్ రెడ్డి చూపిన మానవతా దృక్పథాన్ని కొనసాగిస్తూ, ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలుస్తున్నామని నాయకులు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తున్నామని వారు వెల్లడించారు.
