కందాళ ఉపేందర్ రెడ్డి సేవాస్ఫూర్తితో హస్నాబాద్లో సేవా కార్యక్రమం
మాగి రాములమ్మ దశదిన కర్మకు 50 కిలోల బియ్యం అందజేత
సర్పంచ్ కొవ్వూరు పద్మ – సత్తిరెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ నాయకుల పరామర్శ
తిరుమలాయపాలెం, జూన్ 28(ఖమ్మం వాణి): పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి అందిస్తున్న సేవలను ఆదర్శంగా తీసుకుని వివిధ గ్రామాల్లో బిఆర్ఎస్ నాయకులు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఆయన సేవాస్ఫూర్తిని ప్రజలకు గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలో ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం హస్నాబాద్ గ్రామంలో గ్రామ సర్పంచ్ కొవ్వూరు పద్మ – సత్తిరెడ్డి ఆధ్వర్యంలో ఇటీవల మరణించిన మాగి రాములమ్మ దశదిన కర్మ సందర్భంగా కుటుంబ సభ్యులకు 50 కిలోల బియ్యాన్ని అందజేసి అండగా నిలిచారు. ఈ సందర్భంగా మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించిన సర్పంచ్ కొవ్వూరు పద్మ – సత్తిరెడ్డి వారికి ధైర్యం చెబుతూ, కష్టకాలంలో ప్రతి కుటుంబానికి తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రజా సేవే లక్ష్యంగా ఇటువంటి సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల నాయకులు, గ్రామ వార్డు సభ్యులు, గ్రామ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొని కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గ్రామాల్లో బిఆర్ఎస్ నాయకులు చేపడుతున్న ఈ సేవా కార్యక్రమాల ద్వారా మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి సేవాస్ఫూర్తి ప్రజల్లో మరింత గుర్తింపు పొందుతోందని నాయకులు పేర్కొన్నారు. కందాళ ఉపేందర్ రెడ్డి చూపిన మార్గంలో ప్రతి గ్రామంలో పేదలకు, ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలుస్తూ సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగించాలని మండల నాయకులు పిలుపునిచ్చారు.
