మాలల మహా ధర్నా విజయవంతం: వేలాది మంది పాల్గొన్న మాలలు
హైదరాబాద్|జూలై 06(ఖమ్మం వాణి): జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ పిలుపుమేరకు మాల ఫ్రెండ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మాలల మహా ధర్నాకు అధిక సంఖ్యలో జాతీయ మాల మహానాడు కార్యకర్తలు, నాయకులు పాల్గొని సభను విజయవంతం చేశారు. ఈ సందర్భంగా మాలల సత్తా చాటిన జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్, జాతీయ మాల మహానాడు ప్రధాన కార్యదర్శి బైరి రమేష్, మాల మహానాడు జాతీయ కమిటీ సభ్యులు గోలి సైదులు మరియు వివిధ జిల్లాల నుంచి విచ్చేసిన జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు, కార్యకర్తలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. మాలలకు జరిగే అన్యాయాలపై తగిన సమాధానం ఇస్తూ ముందుకు సాగుతున్న మాల కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్ అన్నారు.
