ఎస్సీ వర్గీకరణ రోస్టర్ పాయింట్ల సవరణపై డిప్యూటీ సీఎం భట్టికి మాల మహానాడు వినతి
ఖమ్మం, జూన్ 22 (ఖమ్మం వాణి):
ఎస్సీ వర్గీకరణలో భాగంగా గ్రూప్-3లోని మాల వర్గానికి కేటాయించిన రోస్టర్ పాయింట్ల వల్ల అన్యాయం జరుగుతోందని, వాటిని సవరించాలని మాల మహానాడు నేతలు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు విజ్ఞప్తి చేశారు. సోమవారం ఖమ్మం కలెక్టరేట్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసిన మాల మహానాడు నేతలు వినతిపత్రం అందజేశారు. గ్రూప్-3లో మాల వర్గానికి ప్రస్తుతం కేటాయించిన రోస్టర్ పాయింట్లను సవరించాలని, ప్రారంభ పోస్టుల్లోనే మాలలకు సముచిత ప్రాధాన్యం కల్పించే విధంగా రోస్టర్ను మార్చాలని కోరారు. గ్రూప్-3 వర్గానికి 16వ రోస్టర్ పాయింట్ లోపలే అవకాశం కల్పించాలని నేతలు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం అమలవుతున్న విధానం వల్ల మాలలు విద్యా, ఉద్యోగ అవకాశాలను పూర్తిగా కోల్పోతున్నారని డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నేతలు గుంతేటి వీరభద్రం, లింగాల రవికుమార్, దాసరి దానియేలు, దామల సత్యం, దాసరి శ్రీనివాస్, కొరివి భాస్కర్, కరాటే వేణు, జమ్మి వీరబాబు, కొట్టే నాగేంద్ర కుమార్, చింతమల్ల గురుమూర్తి, కొప్పుల రామారావు, నూకమల్ల రాజు, మెట్టు రాజు తదితరులు పాల్గొన్నారు.
https://khammamvaani.in/kusumanchi-wine-shops-violation-bjp-leader-complaint/
