భీమ్ ఆర్మీ భారత్ ఏక్తా మిషన్ తెలంగాణ రాష్ట్ర కమిటీ
మహనీయులకు ఘన నివాళులర్పించిన భీమ్ ఆర్మీ తెలంగాణ రాష్ట్ర చీఫ్ కార్యదర్శి పప్పుల లక్ష్మీనారాయణ
హైదరాబాద్|జూలై 05 (ఖమ్మం వాణి): టి.జి మలక్పేట్ మాల సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మకంగా కొనసాగుతున్న “ప్రతి రోజు ప్రతి వ్యక్తి జ్ఞాన మాల” కార్యక్రమంలో భాగంగా 66వ రోజు పూలమాల సమర్పణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎం.ఎం.ఎస్ కార్యదర్శి అమర్లపూడి రంగరాజు మహనీయుల విగ్రహానికి పూలమాల సమర్పించి ఘన నివాళులర్పించారు. సంఘ సభ్యుల ఆహ్వానం మేరకు భీమ్ ఆర్మీ భారత్ ఏక్తా మిషన్ తెలంగాణ రాష్ట్ర చీఫ్ కార్యదర్శి పప్పుల లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని మహనీయులకు పూలమాల సమర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పప్పుల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని, విద్య, సంఘటిత శక్తి, రాజ్యాంగ పరిరక్షణ ద్వారానే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని తెలిపారు. సమాజంలో చైతన్యం పెంపొందించే ఇటువంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టి.జి మలక్పేట్ మాల సంఘం వ్యవస్థాపకులు అధ్యక్షులు ముప్పిడి బలవంత్, అధ్యక్షులు పాత్యార నర్సింగ్ రావు, సంయుక్త కార్యదర్శి అనుముల నర్సింగ్ రావు, నిర్వాహకులు గరుడా బాలరాజు తో పాటు సంఘ నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహనీయులకు ఘన నివాళులర్పించారు. భీమ్ ఆర్మీ భారత్ ఏక్తా మిషన్ తెలంగాణ రాష్ట్ర కమిటీ సామాజిక న్యాయం, సమానత్వం, రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం ప్రజల్లో చైతన్యం కల్పించే కార్యక్రమాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపింది.
