సామాజిక సేవకు సీనియర్ విలేఖరికి రాష్ట్ర ఉన్నతాధికారి చేతుల మీదుగా సన్మానం!
నేలకొండపల్లి, జూలై 07(ఖమ్మం వాణి): చెన్నారం గ్రామానికి చెందిన సీనియర్ విలేఖరి, ప్రజావేదిక సంపాదకులు గంజికుంట్ల వెంకన్నను రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారి సీవీ ఆనంద్ మంగళవారం సన్మానించారు. ఖమ్మం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయనకు జ్ఞాపిక అందజేశారు. గ్రామాల్లో చేపట్టిన సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా ఈ సత్కారం నిర్వహించారు. చెన్నారం గ్రామంలో నిఘా కెమెరాల ఏర్పాటు కోసం పెద్ద మొత్తంలో విరాళం ఇవ్వడంతో పాటు, చెన్నారం, కొత్తూరు, మండ్రాజూపల్లి గ్రామ పంచాయతీలకు ఉచితంగా ఇంటర్నెట్ సౌకర్యం కల్పించినందుకు ఈ గౌరవం దక్కిందని వెంకన్న తెలిపారు. ఈ సందర్భంగా ఉన్నతాధికారి మాట్లాడుతూ పోలీసు శాఖ విజ్ఞప్తికి స్పందించి ప్రజా సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం అభినందనీయమన్నారు. రాబోయే రోజుల్లోనూ ఇలాంటి మంచి కార్యక్రమాలను విస్తరించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
