ఆన్‌లైన్‌తో సంబంధం లేకుండా రైతులకు అందించాలని
రైతు సంఘం మండల కార్యదర్శి బింగి రమేశ్
ఖమ్మం/తిరుమలాయపాలెం:జూన్ 17(ఖమ్మం వాణి) కల్తీ విత్తనాలను అరికట్టి కాంప్లెక్స్ ఎరువులను ఆన్‌లైన్‌తో సంబంధం లేకుండా రైతులకు అందించాలని తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం తెలంగాణ రైతు సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.వ్యవసాయ సీజన్ ప్రారంభమైనందున మండలంలో రైతులకు కల్తీ లేని విత్తనాలు సరఫరా చేయాలని, నకిలీ విత్తనాలు విక్రయించే డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో కోరారు.రైతు సంఘం మండల కార్యదర్శి బింగి రమేష్ మాట్లాడుతూ వ్యవసాయ సీజన్లో నకిలీ విత్తనాల పేరిట రైతులను మోసం చేస్తున్న డీలర్లపై చర్యలు తీసుకోవాలన్నారు. యూరియా, కాంప్లెక్స్ ఎరువులను ఆన్లైన్ ప్రక్రియతో సంబంధం లేకుండా నేరుగా రైతులకు అందించాలని, అవసరమైన పురుగుమందులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల అధ్యక్షుడు పుల్లూరి నాగేశ్వరరావు, మద్దినేని శ్రీనివాసరావు, జానయ్య, వెంకన్న, డి. నిర్మల్ రావు, వీరన్న, విజయపాల్ రెడ్డి, కొత్తపల్లి దామోదర్ రెడ్డి, చిగురుపాటి ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.
