సోలిపురం గ్రామ పంచాయతీలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం
0 నుండి 5 ఏళ్ల చిన్నారులకు పోలియో చుక్కలు – సర్పంచ్ అశోక్ ఆధ్వర్యంలో అవగాహన
తిరుమలాయపాలెం, జూన్ 28(ఖమ్మం వాణి): మండలంలోని సోలిపురం గ్రామ పంచాయతీలో ఆదివారం సర్పంచ్ అశోక్ ఆధ్వర్యంలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని 0 నుండి 5 సంవత్సరాల వయస్సు గల చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. `ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు, పోలియో రహిత భారతదేశం మన లక్ష్యం` అనే సందేశాన్ని గ్రామ ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అశోక్‌తో పాటు ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ ఉపాధ్యాయురాళ్లు, అంగన్వాడీ సహాయకులు, చిన్నారుల తల్లిదండ్రులు మరియు గ్రామ ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సోలిపురం గ్రామ పంచాయతీ తరఫున ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ సర్పంచ్ అశోక్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మరోసారి విజ్ఞప్తి చేశారు.
