తెలంగాణ జేఏసీ చైర్మన్ కరుణాకర్ రెడ్డిని కలిసిన మందడి ఇజ్రాయిల్
ప్రొఫెసర్ కోదండరాం అడుగుజాడల్లో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్ష
తిరుమలాయపాలెం, జూన్ 28(ఖమ్మం వాణి): నూతనంగా తెలంగాణ జేఏసీ చైర్మన్‌గా ఎన్నికైన ప్రముఖ హైకోర్టు న్యాయవాది కరుణాకర్ రెడ్డిని ప్రజాసంఘాల ఐక్యవేదిక తిరుమలాయపాలెం అధ్యక్షులు మందడి ఇజ్రాయిల్ శుక్రవారం హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కరుణాకర్ రెడ్డికి శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లే బాధ్యత నూతన జేఏసీ చైర్మన్‌పై ఉందని, ప్రొఫెసర్ కోదండరాం అడుగుజాడల్లో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మందడి ఇజ్రాయిల్ ఆకాంక్షించారు. న్యాయం కోసం పోరాడిన న్యాయవాది ఇప్పుడు ప్రజల గొంతుకగా జేఏసీకి నాయకత్వం వహించడం గర్వకారణమని, మన ప్రాంతానికి చెందిన వ్యక్తి రాష్ట్ర స్థాయి బాధ్యతలు చేపట్టడం ఎంతో ఆనందదాయకమని అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ జేఏసీ మరింత బలోపేతం కావాలని అభిలాష వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు మందడి ఇజ్రాయిల్, దామల్ల నవీన్ తదితరులు పాల్గొన్నారు.
