కొక్కిరేణిలో పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం
చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ప్రారంభించిన సర్పంచ్ కర్నాటి రాజేందర్ ప్రసాద్
తిరుమలాయపాలెం, జూన్ 28(ఖమ్మం వాణి): మండలంలోని కొక్కిరేణి ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రంలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ కర్నాటి రాజేందర్ ప్రసాద్ ప్రారంభించారు. 0 నుంచి 5 సంవత్సరాల లోపు చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేసి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించడం ద్వారా పోలియో రహిత సమాజ నిర్మాణానికి తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. పిల్లల ఆరోగ్య పరిరక్షణలో పల్స్ పోలియో కార్యక్రమం కీలకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. గ్రామంలోని అర్హులైన ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆరోగ్య సిబ్బందికి సూచించారు.
